రాజు శివ ఇద్దరూ మంచి స్నేహితులు.





రాజు వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరూ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారం చిన్నదే అయినా, వాళ్ళ కుటుంబ అవసరాలకి సరిపోయేది.





అయితే అకస్మాత్తుగా రాజు వాళ్ల అమ్మానాన్నలు ఓ ప్రమాదంలో చనిపోయారు. రాజుకి ఇక నా అన్నవాళ్ళెవ్వరూ లేకుండా అయ్యింది. మరి వాడు బ్రతికేదెలాగ? ఓ టీ కొట్టులో పనికి కుదురుకున్నాడు రాజు.





వాడి కోసం వెతుక్కుంటూ వచ్చాడు శివ. 'చదువుకోకపోతే ఎలారా?' అని వాడు రాజుని ప్రభుత్వం నడిపే బాల కార్మికుల పాఠశాలకు తీసుకెళ్ళాడు. అక్కడ పిల్లలకోసం ఓ హాస్టలు కూడా ఉంది.





పిల్లలిద్దరూ అక్కడి హెడ్మాస్టరు గారితో మాట్లాడారు. రాజు గురించి తెలుసుకున్న హెడ్మాస్టరుగారు వాడిని వెంటనే బడిలో చేర్చుకున్నారు. హాస్టలులో సీటు ఇప్పించారు కూడాను.





ఇప్పుడు రాజు మళ్ళీ చదువుకుంటున్నాడు. సంతోషంగా ఎదుగుతున్నాడు. పెద్దయ్యాక దేశానికి పనికొచ్చే పని ఏదైనా చేయాలనుకుంటున్నాడు.