1. తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
    జవాబు: కట్టిన చోటే!

  2. చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
    జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.

  3. రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
    జవాబు: రసం తీసి!

  4. గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
    జవాబు: నుదుటికి!

  5. బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
    జవాబు: పట్టినంత మంది!

  6. ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు?
    జవాబు: ఒలుచుకొని

  7. హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు?
    జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు!

  8. ఓ ఇంట్లో బోలెడు డబ్బు నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు కూడాను. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు ఎందుకు?
    జవాబు: అది తన ఇల్లే కాబట్టి!

  9. ఆటలు ఆడని ప్లేయర్ ఏంటి?
    జవాబు: సీడీ ప్లేయర్!

  10. డ్రైవర్ లేని బస్ ఏది ?
    జవాబు: సిలబస్!

  11. నాలుకపైన పెట్టుకుంటారు గానీ మింగరు- ఏమిటది?
    జవాబు: తపాలా బిళ్ళ!

  12. పంజరంలో ఏముంటుంది?
    జవాబు: ఏదిపెడితే అదే!

  13. తోటలో పండిన మామిడి పండ్లు కోయడానికి సరైన కాలమేది?
    జవాబు: తోతమాలి లేనికాలం!

  14. వాస్తు శాస్త్రిని బిచ్చగాడు ఏమడిగాడు?
    జవాబు: 'ఏ చెట్టు కింద కాపురం మొదలు పెట్టమంటారు?' అని!

  15. "పాప" భీతి అంటే...?
    జవాబు: 'పాప' అంటే భయపడటం!