మేఘాలమీద ఉరకలెత్తే గుర్రాన్ని తోలుతున్న ఈ రాజ కుమారుడిని చూడండి! ఈ బొమ్మను 'సత్తిరాజు లక్ష్మీనారాయణ' అనే ఇరవై రెండేళ్ల కుర్రాడు, 1955లో గీశాడు.

ఆ రోజుల్లో పిల్లల్ని బలేగా చదివించిన బొమ్మల పత్రిక- 'బాల' -కోసం దీన్ని అతను ముఖచిత్రంగా వేశాడు.

తర్వాత రాను రాను ఆ కుర్రాడికి బాగా చెయ్యి తిరిగింది- ఇంకా ఇంకా మంచి బొమ్మలు గీస్తూ పోయాడు. చాలా చాలా పేరు సంపాదించుకున్నాడు. ఎంతో మంది కళాకారులకు స్ఫూర్తినిచ్చాడు. లెక్కలేనన్ని పుస్తకాలకు అలవోకగా బొమ్మలు గీసి పెట్టాడు.

అతనెవరో కాదు- ప్రసిద్ధ చిత్రకారుడు, సినిమా దర్శకుడు- బాపు ! బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీ నారాయణ! బాపు ఆనాడెప్పుడో గీసిన బొమ్మకు, మరి మీరు ఈనాడు ఓ కథ రాయగలరేమో చూడండి!

మీ కథ బాగుంటే కొత్తపల్లిలో ప్రచురిద్దాం, అందరి చేతా చదివిద్దాం. త్వరగా రాసి పంపండి మరి!