తిరగదిప్పు మంత్రం! టీచర్ : రెండు ఏళ్లు ఎంత? రాము : ఉం.. ఉం...14 టీచర్ : వెరీ గుడ్! మరి ఏడు రెళ్ళు? రాము: నాకు ఆ మాత్రం తెలీదనుకున్నారా, 41!

మీరే గొప్ప! టీచర్: పార్వతీ నిన్ను ఒక ప్రశ్న అడుగుతానమ్మా, బాగా ఆలోచించి సమాధానం చెప్పు! పార్వతి: అడగండి టీచర్! టీచర్: మీ అమ్మ గొప్పదా , మీ టీచర్ గొప్పదా? పార్వతి (కొంచెం సేపు ఆలోచించి): మా టీచరే గొప్పది. టీచర్: చక్కగా చెప్పావు. మరి టీచర్‌లో గొప్ప ఏంటో అదికూడా‌ చెప్పమ్మా. పార్వతీ: మా ఇంట్లో అమ్మ జోలపాట పాడితే నేను ఒక్కదాన్నే నిద్రపోతాను. మరి బళ్ళో మీరు పాఠాలు చెప్పినప్పుడైతే పిల్లలంతా నిద్రపోతారు. అందుకని మీరే గొప్ప టీచర్!

సేకరణ: సి.మమత, 9వతరగతి, జిల్లాపరిషత్‌హైస్కూల్, వెంకటంపల్లి.

గేదెల తప్పు! మేనేజర్ : గేదెల కోసం లోన్ తీసుకొని ఇంత వరకూ ఇన్ స్టాల్ మెంట్స్ కట్టలేదే? నారాయణ: ఇంకా నా గేదెలు పాలివ్వడం లేదయ్యా, నేనేం చెయ్యను?!

చలి పులి! తల్లి: ఏమ్మా మాలినీ! నువ్వు మొక్కలకు నీళ్ళు పోస్తున్నప్పటి నుండి మొక్కలు ఎండిపోతున్నాయి? మాలిని: ఏమోనమ్మా, నాకూ అర్థం కావట్లేదు. చలికాలమని వేడినీళ్లుకూడా పోస్తున్నాను చివరికి.

సేకరణ: సి.మమత, 9వతరగతి, జిల్లాపరిషత్‌హైస్కూల్, వెంకటాం పల్లి.

సేకరణ: రామచంద్ర, 3వ తరగతి, చెన్నేకొత్తపల్లి. (జవాబులు: 43వ పేజీలో..)

సినిమా పిచ్చి! బేరర్: మీకు ఏం టిఫిన్ కావాలి సార్? వెంగళప్ప: ఏమున్నాయిరా డింభకా? బేరర్: ఇడ్లీ, వడ, ఉప్మా, దోసె,.. వెంగళప్ప: ఒక్కొక్కటి కాదు షేర్‌ఖాన్! వంద ఇడ్లీలు ఒకేసారి పంపించు నిలపకుండా తినేస్తా. చట్నీ తక్కువ అయినా పర్వాలేదు, సాంబార్ ఎక్కువగా పంపించు.

సేకరణ: మమత, తొమ్మిదవ తరగతి, వెంకటంపల్లి.

చూపిస్తే ఏడవాలా?

అమ్మ: రాజూ! తమ్ముడెందుకురా, ఏడుస్తున్నాడు? రాజు: మరేం లేదమ్మా, వాడి దగ్గర ఒక చాక్లె ట్ ఉండింది- నేను దాన్ని ఎలా తినాలో చూపించాను వాడికి . -అంతే , ఏడుపు మొదలెట్టేశాడు!