1.కరెన్సీ నోటులో    తెల్లని  భాగం  దేనికి!?   
జవాబు: రఫ్ వర్కు  చేసుకోటానికి.

2.'అర్ధరాత్రి ' కి  వ్యతిరేక  పదం చెప్పమన్న  తెలుగు  మాస్టారు  తలపట్టుకునేదెప్పుడు!?     
జవాబు: 'అర్ధపగలు ' అని  విద్యార్ధి  అన్నప్పుడు.

3.అమ్మ    అదిరిపడేదెప్పుడు!?      
జవాబు: ఒకటోతరగతి  చదివే  కొడుకు  "హోంవర్క్  చెయ్యటానికి   నెట్   సెర్చ్   చేస్తున్నాను" అన్నప్పుడు.

4.పిల్లలు  దేవుడితో   సమానం, మరి  వృద్ధులు.....!?      
జవాబు: ఆస్తి  వుంటే   దేవుళ్ళు - లేకపోతే  దెయ్యాలు.

5.పురాణ కాలంలో   ప్రపంచ బ్యాంకుని  ఏమని  పిలిచేవారు?     
జవాబు: కుబేరుడు.

6. కలికాలం   అంటే?     
జవాబు: 'అన్నమో  రామచంద్రా' అన్న తోటి వాడికి   అన్నం  పెట్టకుండా  ఆకలనే   అడగని  రామచంద్రుడికి   నైవేద్యం  పెట్టటం.

7.జాతకం  చూపించుకోటానికి   ఎవరి దగ్గరకెళితే  మంచిది?      
జవాబు: జాతకం  చూసేవాళ్ళలో    ఎవరి  జాతకం  బాగుందో తెలుసుకుని,  అతని  దగ్గరకెళ్తే  మంచిది.