ఏప్రియల్ మాసపు కొత్తపల్లికి స్వాగతం.

ఈ సంచికలో పిల్లలు రాసిన కథలు ఎనిమిది మిమ్మల్ని అలరిస్తున్నాయి:
*చిట్టి కుందేలు పెద్ద ఎలుగుబంటిని ఎలా బురిడీ కొట్టించిందో తెలుసుకోవాలంటే చదవండి:
అనంత పురం జిల్లా కోగిర బడిలో ఎనిమిదో తరగతి చదువుతున్న నాగేంద్ర రాసిన చిట్టి బొమ్మల కథ పరుగో పరుగు....

చిన్నయసూరి రాసిన మూడు చేపల కథ తరహాలో సాగే వేరే కథ చదవండి:
అనంత పురం జిల్లా గుండువారి పల్లి పాప ఆశ రాసిన ముందు చూపు....

స్టేప్లర్‌తో కూడా ప్రాణాలు కాపాడుకోవచ్చు- తెలుసా? ఇదిగో నియతి శ్రీ శేష (రిషివ్యాలీ స్కూల్) కథ ప్రాణం కాపాడిన స్టేప్లర్... చదవండి!

మోసకారి పెద్దన్న, అమాయకపు చిన్నోడు- తెలుసుగా, కథ ఎట్లా ఉంటుందో, చదవండి:
జహీరాబాదు పాప బ్లెస్సీ రాసిన అన్నదమ్ముల కథ...

రాజ్యంలో ఒక ప్రాంతం వాళ్ళు తమ సమస్యను చెప్పారు. మిగతాప్రాంతాలవాళ్ళు చెప్పలేదు. మరి రాజు బాధ్యత ఏంటి? చదవండి:
హైదరాబాదు చైతన్యపురి పాప మృదుల రాసిన కథ రాజకుమారుడి ఉపాయం...

గొప్ప డిటెక్టివ్ తరహాలో సాగే అర్థం లేని అల్లరి కథ ఇదిగోండి, చదివి నవ్వుతూ భయపడండి:
బెంగుళూరు పాప శ్రీసృజన రాసిన తప్పిపోయిన పులిపిల్ల...

ముసలమ్మకు సహాయం చేసిన రాజం పదోతరగతిలో జిల్లా ఫస్టు వచ్చాడు. చివరికి వృద్ధాశ్రమం కూడా నడిపాడు. ఇదిగో, :
ముస్తాబాద్, కరీంనగర్ జిల్లా జడ్ పి హెచ్ యస్ లో తొమ్మిదో తరగతి చదివే బోయిన అజయ్ చేసిన సహాయం...

ఒకరికి చెడు చేద్దామని పోయి తనే చెడిన వాడి నిజం కథ చదవండి:
కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పిల్లాడు ఆడెపు సౌమిత్ రాసిన కథ చెడపకురా, చెడేవు....

ఇవి కాక, పెద్దలు రాసిన పెద్ద కథలు నాలుగు:

అద్భుత సాహస జానపద కథలు మనకే కాదు; రష్యా వాళ్లకీ ఉంటాయి. కావాలంటే ఇదిగో చూడండి, మన కథ లాంటి కథే:
రాధ మండువ గారు అనుసృజన చేసిన రష్యన్‌కథ బంగారు ముక్కు పొడుం భరిణ...

రాత్రి పడుకోబోతున్న డాక్టరుగారిని తీసుకెళ్ళినవాళ్ళు ఎవరు? హారర్ తొలగించేసిన ఐర్లాండ్ జానపద కథ ఇదిగోండి:
స్టోరీ నోరీ వారి కథ డాక్టరుగారు-యక్షుల ఊరు...

గురువుల మాటలు వినని నలుగురు మిత్రుల కథ, ఈ మాసపు కొత్తబేతాళం. చదివి ఆలోచించేందుకు :
అనంతపురం రాధ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న కుల్సుంబీ రాసి పంపిన కథ ఆధారంగా తయారైన నలుగురు మిత్రులు....

సుగుణ రూపనగుడి గారి సౌజన్యంతో, తెనాలి రామలింగడి తెలివిని గుర్తు చేసుకునే మత్కుణం కథ..

ఇవి కాక ఎప్పటిమాదిరే అవీ-ఇవీ ఉన్నాయి...
మరి కదలండి ముందుకు- కథల విందుకు!