ఈ బొమ్మను చూ డండి; ఈ కవితను చదవండి!
వీలైతే మీరూ ఓ కవిత రాసి పంపండి మాకు; వీలు చేసుకొని ప్రచురిస్తాం!



పిల్లలు ఆడుకునే తోటలోనే
పెద్దలు నడవడానికో బాట
బాతులు నడుస్తుంటాయి ఆ త్రోవలో
కొలను ఒకటుంది కదా మరి ఆ చోటులోనే




బాట మధ్యలో వంతెన ఒకటుంది
కొలను దాటడానికి అది ఉపయోగపడుతుంది
దాని క్రింద నీళ్ళలో తిరుగాడుతుంటాయి
తిండి కోసం తాబేళ్ళు కొన్ని


ఆ తోటకి వచ్చినప్పుడు ఒకసారి
పెద్దవాడు తీశాడు ఒక బొమ్మ
చిన్నవాడు వేశాడు ఒక బొమ్మ
వాటిని దాచుకుంది గుర్తుగా వాళ్ళ అమ్మ !