సిరియా దేశంలో అంతర్యుద్ధం జరుగుతోంది. సైన్యానికి, తిరుగుబాటు దారులకి మధ్య తీవ్రమైన యుద్ధం.. అమెరికా వాళ్లు తిరుగుబాటు దారుల పక్షం, రష్యా వాళ్లు సైన్యపు పక్షం..చమురు నిల్వల కోసం అధిపత్యపు పోరు..

అందరు ప్రజలలాగే పన్నెండేళ్ల షహీన్ కూడా వీళ్లందరి నడుమన చిక్కుకున్నది. తండ్రి అజార్ మాజీ సైనికుడు. తిరుగుబాటు దారులు అతన్ని సైనిక రహస్యాల కోసం, సైనికులు తిరుగుబాటు దారుల రహస్యాల కోసం వేధిస్తుంటారు.

ముందుచూపు గల అజార్ షహీన్‌కు ధైర్యంగా బతకాలని నేర్పించాడు. మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చాడు. తుపాకి పట్టుకోవడం నేర్పించాడు. ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో చెప్పాడు. అతను ఊహించినట్టుగానే, ఆ శిక్షణ మధ్యలోనే సైన్యం అతన్ని ఎత్తుకెళ్లింది; చంపేసింది కూడా!



ఒకవైపున సైన్యం నుండి, మరో వైపున తిరుగుబాటు దారుల నుండి తప్పించుకుంటూ షహీన్ ఓ బాలికల శిబిరం చేరుతుంది. తోటి బాలికల్ని, గ్రామప్రజల్ని, యువకుల్ని కూడగడుతుంది. నాయకురాలు అవుతుంది. ప్రజలంతా స్వతంత్రంగా నిలబడి అణచివేతని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తుంది. చివరికి సిరియా మొత్తాన్ని ప్రజల వశం చేస్తుంది. "పిల్లలకు కావలసింది యుద్ధాలు కాదు-చదువులు" అని నినదిస్తుంది.

తానా-మంచి పుస్తకం వారి బాల సాహిత్యపు పోటీ 2017 లో బహుమతి పొందిన ఈ అద్భుత సాహస నవల, 8-9-10

తరగతుల పిల్లల కోసం. బాగుంది.

తప్పక చదవాల్సిన మంచి పుస్తకం!