1.ధన వంతుల అబ్బాయికి ట్యూషన్ చెప్పే మాస్టారు తలపట్టుకునేదెప్పుడు!?

వాడికి ఎన్నిసార్లు 'ఎ,బి,సి,డి....' లు నేర్పినా 'ఎ,సి' మాత్రమే రాస్తున్నప్పుడు !!

2. దంతవైద్యుడు చాక్లెట్ ఫాక్టరీ పెడితే ....!?

"చాక్లెట్ తినటం పళ్ళకు హానికరం "అని ప్రతి చాక్లెట్ మీదా ప్రింట్ చేస్తాడు!!

3. మౌనవ్రతం ఎక్కడ విజయవంతం అవుతుంది!?

లైబ్రరీలో

4. డబ్బింగ్ ఆర్టిస్ట్ తల్లి అయి ఏం చేస్తుంది!?

రికార్డు చేసిన జోలపాటకు పెదిమలు కదిలిస్తూ పిల్లాణ్ణి నిద్రపుచ్చుతుంది.

5. తండ్రి తల పట్టుకునేదెప్పుడు!?

"లెక్కల్లో సున్నా వచ్చిందేంట్రా " అని కొడుకును అడిగితే "సున్నాని కనిపెట్టింది మన భారతీయులే నాన్నా" అని కొడుకు గర్వంగా చెప్పినప్పుడు!

6. ఆర్.టి.సి కి లాభాలు తెప్పించమంటే తెలివైన కండక్టరు ఏం చేశాడు!?

లావుగా వున్న ప్రయాణీకుల్ని ఒకటిన్నర టికెట్ తీసుకోమన్నాడు!

7. విమాన ప్రయాణాల్లో విడ్డూరం ఏంటి!?

విమానాల్లో తీసుకెళ్ళే లగేజికి లిమిట్ ఉంటుంది; కానీ ప్రయాణీకుల బరువుకి మాత్రం ఏలాంటి పరిమితీ ఉండదు!

8. మేనేజర్ అయోమయంలో పడేదెప్పుడు!?

"నాకు చెడ్డపేరు తెచ్చుకునయినా సరే మీకు మాత్రం మంచి పేరు తెస్తాను సార్" అని అసిస్టెంట్ మేనేజర్ అన్నప్పుడు!