ఎందుకో.. ఎందుకో?
వసంతురాకఎందుకో (2)
'ఎందుకో..?'

ఆశలన్ని దూసి పోసి
అలమటించే మల్లె తీవెకు(2)
క్రొత్త చివురులు పల్లవింప,
జీవమొసగేటందుకే(2)
'ఎందుకో..?'

మూగవోయెను తనకు గళమని
మూలవగచే కోయిలమ్మను(2)
మావి గుబురులు చేర బిలిచి
గళము మీటేటందుకే (2)
'ఎందుకో ..?'

మధువు కరవై వ్యథను చెంది
తరువు తరువు తెరుగు తేటికి(2)
వేప తేనియ విందు చేసి
వెతను బాపేటందుకే(2)
ఎందుకో, ఎందుకో..?
వసంతురాకఎందుకో(2)
'ఎందుకో..?'

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song