దండాలు దండాలు భారత మాతా!
అవి అందుకుని దీవించు భారత మాతా !! (2) గాంధీ మహాత్ముడు భారత మాతా!
నీ ముద్దు కొడుకున్నాడే భారత మాతా!!(2)

నీ ముద్దు కొడుకుండగా భారత మాతా!
మా కేమి కొదవలేదు భారత మాతా!!(2)

తిట్టినట్టి వాండ్లను భారత మాతా!
తిట్టనైన తిట్టమమ్మ భారత మాతా!!(2)

కొట్టినట్టి వాడలను భారత మాతా!
కొట్టనైన కొట్టమమ్మ భారత మాతా!!(2)

మమ్ము చంపబోయినారు భారత మాతా!
కొంచెమైన జంకమమ్మ భారత మాతా!!(2)
కొంచెమైన బెదరమమ్మ భారత మాతా!
నీ పాదాల తోడు తల్లి భారత మాతా!!(2)

మూడువందల యేండ్ల కింద భారత మాతా!
కంపెనోడు దిగినాడే భారత మాతా!!(2)

నీ ఊరు కొన్నాడే భారత మాతా!
మన దేశమెల్ల దోచినాడే భారత మాతా!!(2)

అడవులన్ని వాడివంట భారత మాతా!
వాడి అబ్బ వచ్చి వేసినాడ భారత మాతా!!(2)

సముద్రాలు వాడివంట భారత మాతా!
వాడి తాతలొచ్చి తవ్వినార భారత మాతా!! (2) దండాలు దండాలు భారత మాతా!
అవి అందుకుని దీవించు భారత మాతా !!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song