నందామయా గురుడ నందామయా
ఆనంద దేవికి నందామయా (2)

బంజర్లు పేదలకు పంచుతామని చెప్పి
భూస్వాములకే కట్టబెట్టారయ్యా (2)
"నందామయా"

అన్నపూర్ణవంటి ఆంధ్రభూమిని నేడు
బియ్యానికే కరువు పెంచారయా
"నందామయా"

బ్యాంకుల్లో డబ్బంతా పేదోల్లకని చెప్పి
కొసకు నెత్తిన చెయ్యి పెట్టారయ్యా
"నందామయా"

కలవోల్ల లాభాలు పొలికలగా హెచ్చించి
పేదోల్లపై పన్ను పెంచారయ్యా
"నందామయా"

దేశసేవకె తాము దిగివచ్చినామంటూ
గోటు దాసరిపాట పాడారయా
"నందామయా"

మన వోట్లతో వాల్లు మంత్రిదాకా వచ్చి
కుచ్చుటోపీ ప్రజలకు పెట్టారయా
"నందామయా"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song