
కాపాడు కాపాడు వినాయకా కష్టాలు నష్టాలు రానీయక కల్లలు కపటాలు ఎరుగని పిల్లవాళ్ళము మమ్ము దయగని ।కాపాడు । ఏనుగు తొండము వాడవని ఎకసెక్కముగ మాటలాడమయా ఎలక వాహనమెక్కి వచ్చావని చులకనగ నిన్ను చూడమయా । కాపాడు । ఓ బొజ్జ గణపయ్య దండాలయ్యా మావద్ద నువు నిలిచి ఉండాలయ్యా ఈ సజ్జ పూలన్ని నీకేనయా మా ఒజ్జవై విద్యలొసగాలయ్యా ।కాపాడు । సూరీడుకన్న మును లేచామయ్యా నేరేడు మారేడు తెచ్చామయ్యా కుడుములు ఉండ్రాళ్లు పెట్టామయ్యా ఇడుములు నీవే పోగొట్టాలయ్యా |కాపాడు ।