ఒక రోజు సునీత తన తమ్ముళ్ళతో పాటు సినిమాకు వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం అయ్యింది.

ఇంట్లో అమ్మ లేదు. ఇంటి తలుపు తాళం తీస్తూ వెనక్కి తిరిగి చూసింది. అందమైన సూర్యస్తమయం ఒకటి కనబడింది.
ఇంట్లోకి వెళ్ళాగానే, కొంచెం నడుం వాల్చింది సునీత. కిటికీలోంచి ఆ సూర్యాస్తమయాన్నే చూస్తూండగా నిద్రపట్టింది.
రాత్రయింది. సునీత సినిమానుండి వెనక్కి వచ్చింది. ఇంటి బయట ఎవరో నిల్చొని ఉన్నారు.


సునీత ఇంట్లోకి వెళ్తుంటే తనకేసే చిత్రంగా చూసారు వాళ్ళు. బయట నిల్చోని, లోపల ఉండేవారిని తను అడిగింది "సునీత ఇంటికి వచ్చిందా?" అని.

అంతలో సునీత వాళ్ళ అమ్మ కనిపించింది. "సునీత ఇంటికి ఎప్పుడో వచ్చింది!" అన్నది. "అరే! సునీత ఇంట్లోనే ఉన్నదట! మరి నేనెవరు?!" అనుకుంటూ ఉలిక్కిపడి నిద్రలేచింది సునీత!