నా టోనీ!

నా గుర్రం పేరు టోనీ. నేను దానితో సెలవులలో దానితో ఆడుకుంటాను. అది చాలా దృఢమైనది గుర్రం. అది బ్రౌన్ రంగులో ఉంది. దాన్ని నేను నా కబోర్డ్‌లో పెట్టుకుంటాను. నేను దానితో మంచం పైన ఆడుకుంటాను. దానితో నేను స్వారీ చేస్తాను. దాన్ని దౌడ్ తీయిస్తాను. దానికి మెరిసే జుట్టుంది. వీపు పైన జీను ఉంది. నాకంటే అది చాలా ఇష్టం. అది మూడు వందల రూపాయలు. ఆ గుర్రాన్ని మా అవ్వ కొనింది. అది మా అవ్వ దాన్ని కడపలో కొనింది. మా స్నేహితులకు నా బొమ్మంటే చాలా ఇష్టం. నేను దానితో మూడేళ్ళనుంచి ఆడుకుంటున్నాను.

నేను ఒకసారి నేను నా గుర్రాన్ని మా కిటికి పైన వేసాను. నన్ను మా అమ్మ తిట్టింది. అపుడి నుంచి ఇప్పుడి వరుకు దాన్ని విలువైన బంగారంలో చూసుకుంటున్నాను. దానితో నేను ఇప్పుడు ఆడుకుంటున్నాను. అది చాలా దృఢమైన గుర్రం. నేను పెద వాడిని అయితే నేను ఈ గుర్రాన్ని కానుకగా నా పిల్లలకు ఇస్తాను. నాకు నా గుర్రం చాలా ఇష్టం. దానికి పొడువైన తోక ఉంది. అదే నా ఫేవరెట్ బొమ్మ. -రిత్విక్

నా పులి బొమ్మలు!

నా పులులు చాలా దృఢంగా, అందంగా ఉంటాయి. మా అమ్మ ఆ రెండు పులిల్ని నా పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. ప్రతీ రాత్రి నేను వాటితో పడుకుంటాను. నా బొమ్మల పేర్లు రిక్కి, నిక్కి. రిక్కి ఏమొ తెలుగు రంగులో ఉంటుంది. ఇంకా నిక్కి ఏమొ బ్రౌన్ రంగులో ఉంటుంది. నాకు నా బొమ్మలు నాకు అంటే చాలా ఇష్టం. నేను నా బొమ్మలతో చాలా అల్లరి చేస్తాను. నా బొమ్మ అంటే నా అందరి స్నేహితులకు ఇష్టం. నా పులిల్కి చాలా జుటు, చిన్న కళ్లు, అందమైన నల్ల గీతలు ఉంటాయి.

ఆ గీతలు నా ఉలికే అందానిస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఆ పులిలు నిజమైన పుల్లుల కనిపిస్తాయి. దాని కళ్ళుని చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ రెండు పులిలు ఐదు వందల రుపాయలు విలువ చేసింది. అవిటి చెవులు చూస్తే నాకు పెద్ద పెద్ద శంఖాలు గుర్తుకొసాయి. దాని తోక చూస్తే, సెరీరం చూస్తే నాకు పిల్లి సెరీరం గుర్తుకొస్తుంది. దాని మీసాలు చూసే, నాకు దృఢంగా ఉన్న సింహం గుర్తుకోస్తుంది. నేను పెదైనాకా కూడా అవిటిని నేను భద్రంగా దాచి పెట్టుకుంటాను. నాకు నా బొమ్మలు అంటే ప్రాణం. -శ్రీ చరణ్


నా మేక!

నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. కాని నాకు ఒక బొమ్మ అంటే చాలా ఇష్టం. ఆ బొమ్మ ఒక మేక పిల్ల. అది తెల్లగా ఉంటుంది. దానికి ఫ్లాపీ చవులు ఉన్నాయి. దానిని నా పుట్టిన రోజు ఆ బొమ్మని కొనిచ్చాడు. ఆ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బొమ్మకి మెరిసే కళ్లు ఉన్నాయి. దానితో నేను నా చెల్లలు దానితో ఆడుకుంటాము. ఎలాంటి ఆటలంటే దాన్ని మేము పెంచుకుంనట్లూ, ఇంకా చాలా ఆటలు ఆడుకుంటాము. ఇంకా దౌడు తీయించినట్లు. దాన్ని నేను వాకింగ్‌కి పిలుచుకొని దాన్ని వెళ్తాను. నేను దాన్ని చిన్నగా ఉన్నాప్పుడు దాన్ని 'తిత్తిల్ లాంబ్' అనే దాన్ని. మనాలనుకున్నాంటే 'లిట్టిల్ లాంబ్' అనాంలనుకున్నాను!! నా చెల్లలకు కూడా అది అంటే చాలా ఇష్టం. అది నాన్న దాన్ని హైద్రాబాద్ నుండి తెచ్చారు. అది ఎంతో మెత్తమెత్తగా ఉంటుందో. నేను అప్పుడప్పుడు దాన్ని గెట్టిగా పట్టుకొని నిదరుపోతాను. దాని పేరు లిట్టిల్ లాంబ్. నేను చెప్పినట్టే దాన్ని నేను చిన్నగ ఉన్నపుడు తిత్తిల్ లాంబ్ అనే దాన్ని. నా బొమ్మ అంటే అందరికీ ఇష్టంమే. ఆ బొమ్మ నాకు ఎంతో ఇష్టం. నేను పెదైయాకా కూడా ఉంచుకుంటాను. దాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అది చాలా ముద్దుగా ఉంటుంది. అది ఎప్పటికి ఇష్టంమే. -వర్షిణి

నా పాప బొమ్మ!

నాకు ఒక బొమ్మ ఉంది. దని పేరు టెస్వి. అది ఎరుపులో ఉంది. దాని జుట్టు పసుపు రంగు. అది అనంతపురంలో కొనుకున్నాను. అది 200 అయింది. అది కొంచెం తెలుపులో ఉంది. అది లావుగా ఉంది. అది మెత్త మెత్తగా ఉంది. అది నేను రవికి తెచ్చాను. దానితో నేను పడుకుంటాను. దాని కళ్లు నలుపులో ఉంది. నేను దానికి భటలు వెస్తాను. దానికి ఒక బ్లెటు వేసను. నేను దాని తొరొగు పడుకుంటాను. దానికి ఒక చినా తోక- దానికి ఒక జిప్ ఉంది. అది చాలా ముదుగా ఉంటుంది. నేను దాని చాలా జగ్రతగ చుసుకుంటాను. దనికి కళ్ళు మేరుస్తాను. అది చాలా అందంగా ఉంది. -శ్రీజ