1. abcdలు దేనికి ఉపయోగపడతాయి?
జవాబు: క్రీస్తుపూర్వం (bc), క్రీస్తు శకం (ad)తెలియ చెయ్యటానికి

2. రచయిత్రి వంట చేస్తే..?
జవాబు: ఈ వంట నా సొంతం, దేనికీ కాపీ లేదు" అని రాసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది.

3. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తిన దగిన ఫలాలు?
జవాబు: వార ఫలాలు

4. భోజన హోటల్ ముందు బిచ్చగాడు ఏమంటాడు?
జవాబు: బాబూ! ఒకఫుల్ మీల్స్ పార్శిల్ బాబూ

5. స్పేస్ సైంటిస్ట్ దీపావళి తారాజువ్వ కాలిస్తే...?
జవాబు: 10...9...8...అంటూ కౌంట్‌డౌన్ ప్రారంభిస్తాడు.

6. ఇంటి ఓనరు ఇరిటేట్ అయ్యేదిఎప్పుడు?
జవాబు: ఇల్లుపీకి పందిరెయ్యమని వాస్తు సిద్ధాంతి అన్నప్పుడు

7. సైన్సు సార్‌కి కోపం వస్తే ఏమంటాడు?
జవాబు: నా బ్లడ్ బాయిలింగ్ పాయింట్ పెరుగుతోంది, జాగ్రత్త! అంటాడు.