1. ఆర్.టీ.సీ. డ్రయివర్ అదిరి పడేదెప్పుడు?
జవాబు: "నాకోసారి బస్సు నడపాలని వుంది" అని భార్య అన్నప్పుడు !!

2. సైకియాట్రిస్టు సందిగ్ధంలో పడేదెప్పుడు?
జవాబు: "కలలో అలారంమోగి మెలకువ వచ్చేస్తుంది" అని పేషెంటు అన్నప్పుడు!!

3. వినాయకుడు భూలోక విహారం చేస్తే ........?
జవాబు: తన వాహనాన్ని "మౌస్" అని పిలుస్తాడు!!

4. పని చెయ్యని వాళ్లకు ఇచ్చేదేమిటి?
జవాబు: "పని"ష్మెంట్!!

5."సోమరి" దేనికి ఉపయోగపడ్తాడు?
జవాబు: సినిమా టైటిల్ గా!!

6. లగేజ్‌కి లిమిట్ లేనిదెక్కడ?
జవాబు: స్కూలు బాక్స్ లో

7. అరణ్య రోదనం అంటే...?
జవాబు: 'మమ్మల్ని నరికేస్తున్నారో' అని చెట్లు మొరపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవటం