ఒక ఊరులో పెద్ద రావి చెట్టు మీద, ఒక కాకి ఉంది. ఆ కాకి దగ్గర చాలా పాలు ఉన్నాయి.










ఆ చెట్టు దగ్గరే ఒక పిల్లి కూడా ఉంది. ఒక రోజు పిల్లికి చాలా దాహం వేసింది. అది కాకి దగ్గరకు వచ్చి










"కాకీ! కాకీ! నాకు కొంచెం పాలు ఇస్తావా?" అని అడిగింది.







అప్పుడు కాకి, "పాలు లేవు, గీలు లేవు, ఫో!!" అంది. పిల్లికి చాలా బాధ వేసింది.










కొన్ని రోజుల తరువాత, కాకికి చాలా దాహం వేసింది. అప్పుడు కాకి దగ్గర పాలు లేవు.










అది పిల్లి దగ్గరకు వెళ్ళి "పిల్లీ! నీళ్ళు ఇస్తావా?" అని అడిగింది. పిల్లి కాకికి సంతోషంగా నీళ్ళు ఇచ్చింది.

అప్పుడు, అంతకు ముందు తను పిల్లికి పాలు ఇవ్వలేదన్న సంగతి గుర్తుకు వచ్చి, కాకి సిగ్గుతో తలవంచుకుంది.