ఈ బొమ్మను చూశారా, ఏం జంతువు, ఇది?

మేమే చెప్పేస్తాం..ఇదొక నక్క! కొంచెం జాగ్రత్తగా చూస్తే, ఇది అంత కులాసాగా దేన్ని చూస్తోందో తెలుస్తుంది మీకున్నూ.. దుబ్బల రంగులో కలిసిపోయి ఒక పక్షి ఉంది.. కనబడిందా?

మరి ఈ నక్కకి, పక్షికి ఏం సంబంధం ఉందో, మరి? ఖచ్చితంగా ఏదో కథ ఉంది.. మీకు తెలుసేమో, మరి రాసి పంపించెయ్యండి ! బాగున్న కథల్ని కొత్తపల్లిలో ప్రచురిద్దాం.

మా చిరునామా: కొత్తపల్లి ట్రస్టు, యం ఆర్ వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101 ఫోను:08559 240222, ఇ- మెయిలు: team at kottapalli dot in