పిచుకమ్మా! పిచుకమ్మా!
నీ గూడెక్కడ చెప్పమ్మా?
అవ్వ చెప్పిన కథలో
ఆ పొరుగు కాకి ఏదమ్మా?

పచ్చదనం కరిగిపోయి - చెట్టునీడ కనుమరుగై
ఈ కాంక్రీటు జనారణ్యం - జంతు నీతి సమాజాన

పంట పొలం బీడైతే - పరిగ గింజ కరువైతే
వరికంకుల కుచ్చులున్న - చూరులన్ని నిండుకుంటే "పిచుకమ్మా"

రెండు చేతుల జాతి - వేల వేల చేతులు చాచి
పర్యావరణ సమాతుల్యాన్నే - కకా వికలు చేస్తుంటే "పిచుకమ్మా"

సొంతలాభం మూర్ఖత్వం - భూమినంతా కబళిస్తే
పురుగూ పిట్టా చెట్టూ పుట్టా - ఉనికి మనకి పోతుంటే "పిచుకమ్మా"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song