క్రింది పదాలను జాగ్రత్తగా గమనించండి.. వీటి అమరికలో గొప్పదనం అర్థమైందా?!!! ఆలోచించండి!

వం కా య
కా ర ము
య ము డు

వ ని త
ని క్క మ్ము
త మ్ము డు

జ న ము
న క్క లు
ము లు గు

జ ను ము
ను రు గు
ము గు ద

కా మ ము
మ మ త
ము త క

జ ల గ
ల వ ణ
గ ణ ము

ప్రతి చదరంలోనూ అక్షరాలను నిలువుగాను అడ్డంగాను చదవండి..అవే పదాలు వస్తై!

  • సౌజన్యం:1955 సెప్టెంబరు "బాల"

గొప్ప ప్రశ్నలు

పేరులో 'రన్ ' ఉంటుంది, కాని పరిగెత్తదు..ఏంటది?
జవాబు: 'హారన్ '

డ్రైవింగ్ రాని డ్రైవర్ ఎవరు? జవాబు: 'స్ర్కూ-డ్రైవర్ '

"రుచిలేని కారం ఏంటి?"
“ ఆకారం “

ఎగ్జామినర్ దిద్దని పేపర్?
" న్యూస్ పేపర్ “

ఇల్లు భద్రం!

భార్య : వర్షం కురిసి ఇంట్లోకి నీళ్ళొచ్చాయటండీ!
వెంగళప్ప: అంతా అబద్ధం. నువ్వస్సలు నమ్మకు!
భార్య: ఎందుకండీ?!
వెంగళప్ప : ఇంటికి తాళం వేసి, తాళం చెవులు నా దగ్గరే పెట్టుకున్నాగా!

శుద్ధాత్మ!

వంశీ: అదేంట్రా! దొంగలు నన్ను కొడుతుంటే అలా పారిపోయావు?!
వెంకీ: ఎవరైనా నా స్నేహితుడిని కొట్టడం నేను చూడలేనురా!

తిరగబడ్డ తర్కం!

పెద్దాయన: ఒరేయ్, ప్రతిసారీ ఇలా ఓడిపోతూనే ఉంటావేమి, నీకు సిగ్గు వెయ్యదా?
వెంగళప్ప: విజయంలో కన్నా ఓటమిలోనే ఎక్కువ నేర్చుకోవచ్చని మా తాత ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు పెద్దయ్యా! అందుకే నేను ఎప్పుడూ ఓడిపోతుంటాను, అట్లా ఎప్పుడూ నేర్చుకోవచ్చని!

తెలివైన ధర్మం!

బిచ్చగాడు: అమ్మా ధర్మం చెయ్యమ్మా! పేదవాడికి ఏదైనా దానం‌చెయ్యమ్మా!
పార్వతి: ఏమయ్యా , ఎప్పుడంటే అప్పుడు వచ్చేదేనా? నీకు వేళా పాళా లేదా?
బిచ్చగాడు: నాకు ఓ వాచీ ధర్మం చెయ్యండమ్మా, రేపటినుండీ సరైన టైంకి వస్తా!

ఈ రోజు వేరు!

కస్టమర్: రోజూ కాఫీకి డబ్బు కట్టించుకుంటావు కదా! ఇవాళ ఓ కప్పు కాఫీ ఉచితంగా ఇస్తే ఎంత బాగుంటుంది!
హోటల్ యజమాని: రోజూ కప్పునిండా కాఫీ తాగుతున్నారు కదా, ఇవాళ్ల ఓ ఖాళీ కప్పుతో కాఫీ తాగితే ఎంత బాగుంటుంది!

డూప్లికేట్ సమస్య! రోగి: డాక్టర్!నేను తాళం చెవి మింగేశాను. డాక్టర్: ఎప్పుడు? రోగి: మూడు నెలల కిందట డాక్టర్. డాక్టర్: మరి అప్పటినుండి ఏం చేస్తున్నారు? రోగి: డూప్లికేట్ తాళం వాడుతున్నాను డాక్టర్!

కోపం !

 కోపమునను ఘనత కొంచెమైపోవును
 కోపమునను మిగుల గోడు చెందు
  కోపమడచెనేని కోరికలీడేరు
  విశ్వదాభిరామ వినుర వేమ!

కోపం‌ వల్ల మన గొప్పతనం తగ్గిపోతుంది. కోపం వల్లనే మనం ఎక్కువ దు:ఖానికి లోను కావలసి వస్తుంది. అట్లాంటి కోపాన్ని గనక అదుపులోకి తెచ్చుకున్నట్లయితే కోరికలన్నీ నెరవేరతాయి. అంటే మన కోపాన్ని మించిన శత్రువు వేరే ఏదీ లేదనమాట.