1. పాండవులు అజ్ఞాతవాసం చెయ్యటం ఎలా సాధ్యపడింది!?

జవాబు: అప్పుడు వాళ్లని కనిపెట్టి పట్టుకునేందుకు 'మీడియా' లేదుగా?!

2. గత వైభవాలను తలుచుకుంటూ వర్తమానంలో కాలక్షేపం చేసేవాళ్ళు ఏం కోల్పోతారు!?

జవాబు: భవిష్యత్తు!

3. మంచి డాక్టరు అవ్వాలంటే....!?

జవాబు: మంచి శ్రోత అవ్వాలి!!

4. చౌకగా లభించే సుఖం ఏది!?

జవాబు: నిద్ర

5. హీరోకి పేరు రావాలంటే...!?

జవాబు: డూపు బాగా ఫైట్‌చెయ్యాలి!!

6. కూల్‌డ్రింకు షాపు ఓనర్ వర్కర్‌ని పనిలో నుంచి తీసేస్తే అతను ఏం చేస్తాడు?!

జవాబు: షాపు ఎదురుగా చలివేంద్రం పెడతాడు!

7. వాస్తును నమ్మే ఆఫీసరుతో గుమాస్తా ఏమంటాడు?

జవాబు: " నా సీటు వాస్తు బాగాలేదు, ప్రమోషన్ ఇవ్వండి సార్! " అంటాడు!!