చాలా రోజుల క్రితం ఒక అబ్బాయి ఉండేవాడు. వాడి పేరు రాజు. వాడు అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని హాయిగా బతికేవాడు. ఎప్పుడు చూసినా తింటూ , పాటలు పాడుతూ ఉండేవాడు. ఎవరికీ ఏ సహాయమూ చేసేవాడు కాదు. ఏమైనా అడిగితే తిట్టేవాడు. తోటి వాళ్ళెవ్వరికీ వాడంటే ఇష్టం ఉండేది కాదు. ఒక్క శంకర్ మటుకు వాడి దగ్గర మంచి జోకులువేసేవాడు. రాజు ఆ జోకులకు బాగా నవ్వేవాడు. ఇలా చాలా రోజులు నవ్వించి, శంకర్ చెప్పాడు: "రాజూ, నువ్వు ఇంత చక్కగా నవ్వుతావు, కానీ మరి అందరికీ ఎందుకు సహాయం చేయవు?" అని. వెంటనే రాజుకి కోపం వచ్చేసింది. శంకర్‌తో మాట్లాడటం మానేశాడు.

ఇలా ఉండగా ఆ ఊళ్ళో ఎందుకనో, విష జ్వరాలు మొదలయ్యాయి. రాజుకి కూడా జబ్బు చేసింది. ఊళ్ళో వైద్యులు అందరికీ వైద్యం చేసారు- కానీ రాజుకి మాత్రం చేయలేదు! రాజు ఎంత అడిగినా చేయలేదు; డబ్బులు ఎక్కువ ఇస్తానన్నా ఎవ్వరూ వైద్యం చెయ్యలేదు!

పాపం, దాంతో రాజుకి జబ్బు చాలా ఎక్కువ అయిపోయింది. ఆరోజు రాత్రి వాడికి జ్వరం బాగా ఎక్కువయ్యేసరికి, దాన్ని గమనించి తోటివాళ్ళు వాడిని ఎత్తుకొని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలు పెట్టారు; జ్వరాన్ని అదుపులోకి తెచ్చారు.

మళ్ళీ తెల్లవారేసరికి రాజు జ్వరం తగ్గింది; కానీ ఇంకా చాలా నీరసంగా ఉన్నాడు. వైద్యులు అన్నారు- "ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు మాతో అవసరం ప్రస్తుతానికి తీరిపోయినట్లే. అయినా నువ్వు ఎవ్వరికీ సాయం చెయ్యవు, మరి మీ మిత్రులు నీకు ఎందుకు సాయం చెయ్యాలి? నిన్ను వాళ్ళు ఇక్కడికి ఎందుకు తేవాలి?!" అని.

రాజుకి అప్పుడు చాలా సిగ్గు అనిపించింది. అతను అన్నాడు- "నన్ను మన్నించండి. దయచేసి నాకు సహాయం చేయండి. నా ప్రవర్తన సరిగా లేదు అని అర్థం అయింది. ఇకమీద నేనూ వేరేవాళ్ళకు సాయం చేస్తాను" అని.

వైద్యులు హాయిగా నవ్వారు. "నీకు బుద్ధి రావాలనే ఇట్లా చేసాం, నిజానికి నువ్వంటే మాకు చాలా ఇష్టం" అన్నారు. వాడిని ఇంకొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచుకొని వైద్యం చేసారు.

జ్వరం బాగైంది. అయితే రాజుకి అంతకంటే మేలు జరిగింది- 'ఇతరుల సహాయం లేకుండా మనం బతకలేము' అని అర్థమైంది వాడికి.
ఆ తరువాత రాజు అందరికీ సహాయం చేస్తూ హాయిగా బ్రతికేసాడు.