జయమమ్మ జయమమ్మ జయము
జయమమ్మ జయమమ్మ జననీ
భువనైక పావనీ ఓ భారతావనీ!

ఉభయ సంధ్యలు కవితలుగ్గుపాలుగ బెట్టి
కాళిదాసుని కన్న ఓ పాలవెల్లీ
రాగ తాళపు శ్రుతుల పొత్తిళ్లలో పొదవి
త్యాగయ్య సాకిన ఓ కల్పవల్లీ!

హిమశైల శిఖరాలు కురుల మణులై కుదుర
గంగా తరంగాలు -
బంగారుటంచులై కొంగునమరె
గౌతమీ కృష్ణలు ఒడిపాపలై నీకు ఒదిగిపోగా
మూడు జలధులె నీకు మోకరిల్లెను తల్లీ!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song