1.సినిమాల్లో నటించే కుక్క యజమానిని ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నాడు?
"మా కుక్కని వెటర్నరీ డాక్టరు చెయ్యాలనుకున్నాం కాని అది యాక్టరయింది" అన్నాడు!!

2.వృద్ధ మహిళా పేషెంట్ ఎందుకు మురిసిపోయింది!?
"సాధారణంగా ఇలాంటి జబ్బు యువతులకు మాత్రమే వస్తుంది" అని వైద్యుడు అన్నాడుగా!

3."బంగారం ఎందుకు దొంగిలించావ్" అని జడ్జి అడిగితే దొంగ ఏమన్నాడు?!
"అక్షయతృతీయ సందర్భంగా" అన్నాడు!!

4. డ్రయివర్‌కి చిరాకు ఎందుకొచ్చింది?!
లేడీ కండక్టర్ పదే పదే సైడ్ మిర్రర్లో బొట్టు సవరించుకుంటోందని!

5."ఫీజు ఎక్కువ" అన్న పేరెంట్‌తో ప్రిన్సిపాల్ ఏమన్నాడు?!
"ఏం పర్వాలేదండీ! మీ ఇష్టం! నేటి రూపాయిలే రేపటి డాలర్లు అని మాత్రం మర్చిపోకండి!” అన్నాడు.

6."న్యాయంలో అన్యాయం" అంటే!?
జవాబు: దొంగ సర్టిఫికెట్‌తో న్యాయ వాది అవ్వటం!!

7. 'అత్యాశ' అంటే.....?
జవాబు: టికెట్ కొనకుండా లాటరీ రావాలనుకోవటం!