నిరంతరం చిరునవ్వులు రువ్వే
పూలబాలలం
సుగంధ భరిత-
గులాబీ‌మాలలం
మాయా మర్మం అంటే తెలియని
జాతి ముత్యాలం-
భారత జాతి ముత్యాలం
మోతీ పుత్రుని వారసులం
చాచా నెహ్రూ ప్రేమ పువ్వులం
శాంతి దూత నెహ్రూ..
ఓ శాంతి దూత నెహ్రూ!

సత్యాహింసా శాంతియె సుఖమని
చాటిన గౌతముడే ఈ జగతికి ఆదర్శం
ఆ గౌతమ బుద్ధుని శిష్యులం
ఆ సిద్ధుని ముద్దుల బాలలం

బుద్ధంశరణం గఛ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గఛ్ఛామి

వందేమాతర రచనలు చేసిన
చటర్జి గీతాలం-
భారత జాతి గీతాలం
వందేమాతర గీతానికే
హడలెత్తె బ్రిటిష్ సామ్రాజ్యం
వందే మాతరం..
వందే మాతరం.

విప్లవ శంఖం పూరిస్తూ -
మన్య ప్రజల విల్లంబులు చేస్తూ
దొరల గుండెల్లో దూసుకు పోయిన
అల్లూరి బాణాలం-
రామ రాజు బాణాలం
వందే మాతరం..
వందే మాతరం

సత్యాగ్రహమను ఆయుధం పట్టి
బ్రిటీషువారిని పారద్రోలి
భారతమాతకు స్వేచ్ఛనిచ్చిన
మహాత్మ మనవళ్ళం -
గాంధీ మహాత్మ మనవళ్ళం
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకో సన్మతి దే భగవాన్!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song