మేం పిల్లలం- రేపు పెద్దలం
రేపటి సమాజానికి రూపు దిద్దుతాం
భూగోళం మీదనున్న
ఏదేశం పిల్లలైన-
ఏభాషను మాట్లాడిన-
ఏవేషం వేసుకొన్న-
అందరమూ-అందరినీ
ప్రేమిస్తాం! ప్రేమిస్తాం! ప్రేమిస్తాం!
"మేం పిల్లలం"

కులం మతం రూపు మాపి
కలిమి-లేమి సమంచేసి
కొత్త సమాజానికి మేము
ఎత్తుతాము మాజెండా!
మా జెండా!‌మా జెండా!
"మేం పిల్లలం"

దోపిడీలు దొరతనాలు
అన్యాయాలక్రమాలు
ఏవీ‌ కొనసాగనీక ఎదిరిస్తాం!
ఎదిరిస్తాం! ఎదిరిస్తాం!
"మేం పిల్లలం"

బూతు పురాణాలనెల్ల
పాతరలో పాతిపెట్టి
భౌతిక విజ్ఞానంతో పయనిస్తాం!
పయనిస్తాం! పయనిస్తాం!
"మేం పిల్లలం"

చెమటోడిచి పనిచేసి
జాతి సంపదను పెంచే
శ్రామిక వర్గానికి మా సెల్యూట్!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song