బీపీ!
రాము : రోజూ పొద్దున్నే ఎక్కువ టెన్షన్ పడేది ఏదిరా?
సొమూ : ప్రెషర్ కుక్కర్.

తల రాత!
జోతిష్యుడు : జాతకం చూపించుకొని డబ్బు లివ్వకుండా వెళుతున్నావేంటి?
కస్టమర్ : ఈ సంవత్సరం పిల్లికి కూడా బిచ్చం పెట్టనని నువ్వే చెప్పావుగా.
సేకరణ: బి.దివ్య


పడిపోండి!
ఓ నర్సింగ్ హోం ప్రారంభోత్సవంలో-
ముఖ్య అతిథి: అతి త్వరలోనే మీ హాస్పిటల్ అభివృద్థి చెందాలని ఆశిస్తున్నాను...
డాక్టర్ : థ్యాంక్యూ సర్, దేవుడు మీకొక మంచి జబ్బు తెప్పించాలని ప్రార్థిస్తున్నాను...


సరళరేఖ!

టీచర్ : ఏరా,రవీ! సరళ రేఖ గురించి చెప్పరా.
రవి: మరేమోనండీ, సరళ మా అక్కండి; రేఖ మా పక్కింటి అమ్మాయండీ; వీళ్ళిద్దరూ మంచి స్నేహితులండి!







నువ్వే నేను!
కవిత : బ్యూటీ పార్లర్ కి వెళ్లిస్తున్నావా, దేనికి ?
సుధ : అందంగా కనిపించడానికండీ!
కవిత : మరి కనిపించవేం ?
సుధ: ఏమోనండీ, నన్ను మీలా తయారు చేయమన్నాను మరి!