ఆడే పాడే పిల్లలం!
అమ్మ,నాన్నల ఆశాజ్యోతులం!!(2)

భారతజాతి కేదారంలో
తొలకరి మొలచిన మొలకలం(2)
భావితరాల భాగ్యోదయానికి
వేకువ విసిరిన వెలుగు రేకలం(2)
"ఆడే పాడే పిల్లలం!”

కల్లాకపటం కాటువేయని-
తెల్లని మనసుల మల్లెలం!!(2)
ద్వేషాసూయలు జొరబడని-
దైవానికి ప్రతిరూపాలం(2)
"ఆడే పాడే పిల్లలం! “

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song