గల గల -గల గల
గల గల గల గల గల
క్రిష్ణమ్మ పాడింది కమ్మని పాట
అది పలకాలి బాబులూ మీ నోట (2)

అడ్డంకులెన్నెన్నొ ఎదురైనా
అవమానం నైరాశ్యం వెక్కిరించినా
బెదరక, చెదరక సాగిపొమ్మని
క్రిష్ణమ్మ పాడింది కమ్మని పాట
అది పలకాలి బాబులూ మీనోట

పరులమేలు తలవనివారి జీవితం
ఉన్నా, లేకున్నా మరి ఒకటేనని
ఉపకారం ఊపిరిగా చేసుకొమ్మని
క్రిష్ణమ్మ పాడింది కమ్మని పాట
అది పలకాలి బాబులూ మీనోట

బ్రతుకంతా ఉత్సాహం ఉండాలని
ఎవరికాళ్లపై వాళ్లు నిలబడాలని
చేయి చాచుటకన్నా చావు మేలని
క్రిష్ణమ్మ పాడింది కమ్మని పాట
అది పలకాలి బాబులూ మీనోట

గతంనుంచి మంచిని నేర్చుకొమ్మని
ఆకశాన్ని స్వర్గంగా మలచుకొమ్మని
విశ్వాస విజయమ్మే తథ్యమని
క్రిష్ణమ్మ పాడింది కమ్మని పాట
అది పలకాలి బాబులూ మీనోట

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song