1. ఎంత వెతికినా కనబడనిది, ఏమిటది?

  2. గుప్పెడు పిట్టకు బారెడు తోక ?

  3. ఒకటి లేపితే రెండు ఊగులాడుతాయి?

  4. ఇంతింతాకు పచ్చని ఆకు, రాజులు మెచ్చిన రత్నాలాకు - ఏమిటది?

  5. ఆ బాబూ ఈ బాబూ పోట్లాడితే, పకీరు సాయిబు వచ్చి తగవు తీర్చాడట. ఏమా కథ?

  6. పిఠాపురం చిన్నవాడ పిట్టలు వేటాడేవాడ బతికిన పిట్ట లు కొట్టొద్దు చచ్చిన పిట్టలు కొట్టొద్దు కూరకు ఏమితెస్తావు ? ఊరికే ఇంటికి రానూ వద్దు వచ్చావంటే తంతా తంతా , ఏమి తెస్తావు? నువ్వేమితెస్తావు?

  7. ఒక పచ్చ కుండలో ఒక కాయ , ఆ కాయ మధ్యలో నల్లటి విత్తనాలు. ఏంటది?

  8. పచ్చని కుండలో చిన్న చిన్న కాయలు, దాంట్లో చిన్న చిన్న నల్లని విత్త నాలు. ఏమిటది?

  9. పచ్చని కుండలో తెల్లకుండ, తెల్లనికుండలో నీళ్ళు, ఏంటవి?

  10. కాళ్ళు లేకున్నా నడుస్తుంది. కళ్ళు లేకున్నాఏడుస్తుంది. ఏమిటది?

  11. చల్ల చల్లని మంచం, ఎంత ఎక్కినా అణగదు. ఏమిటది?

  12. రాత్రి చాపుకుంటుంది , పగలంతా ముడుచుకుంటుంది. ఏమిటది?

  13. రంధ్రాల గుర్రం ఎంతమందినైనా మోస్తుంది. ఏంటది?

  14. పాలు ఉన్నై, కానీ బాలింత కాదు పిల్లలందర్నీ పక్కనేసుకొని పచ్చగా ఉంటుంది- ఏమిటది?

  15. కోటుమీద కోటు

    కోటు మీద కోటు

    కోటు తీస్తే ఏడుపొచ్చె- ఏంటది?

  16. వెయ్యి కండ్ల పులి వేటకు వెళ్లింది- ఏంటది?

  17. చందమామ దూరమా, చైనా దూరమా?
    చైనానే. ఎందుకు?

  18. గుంపు గుంపు చెట్లలో ఎర్ర పిల్ల - ఏంటది?

  19. ఎక్కలేని చెట్లకి లెక్కలేనన్ని కాయలు- ఏంటది?

  20. పొద్దున్నే నాలుగు కాళ్ళతో నడుస్తుంది, మధ్యాహ్నం రెండు కాళ్ళతో నడుస్తుంది, సాయంత్రం మూడు కాళ్ళతో నడుస్తుంది. అది ఎవరు?

  21. ఒక చిన్న కుండలో ఊరంతటకీ అవుతుంది- ఏంటది?

  22. గుంపు గుంపు చెట్లలో ఒక చిన్న దారి- ఏంటది?

  23. దబ్బల దబ్బల అడవి . కొంచెం ముందుకు వస్తే రెండు లైట్లు. ఇంకొంచెం ముందుకు వస్తే రెండు గుంతలు . మరికొంచెం కిందికి వస్తేఒక బావి. బావిలో ఒక ఒంటరి చేప.


పొడుపు కథలకి సమాధానాలు :

1.గాలి
2.గరిటె
3.త్రాసు
4.తమలపాకు
5.తాళంచెవి
6.గుడ్డు
7.పుచ్చకాయ
8.సీతాఫలం
9.టెంకాయ నీళ్ళు
10.మేఘం
11.నీళ్ళు
12.చాప
13.మంచం
14.మర్రిచెట్టు
15.ఉల్లిపాయ
16.వల
17.చైనానే దూరం. ఎందుకంటే, చందమామ కనిపిస్తుంది, చైనా కనపడదు కాబట్టి.
18.పండు మిరపకాయ
19.మిరప చెట్టు, మిరపకాయలు
20.మనిషి
21.కుంకుమ
22.పాపిటి
23.జుట్టు, కళ్ళు, ముక్కు రంధ్రాలు, నోరు, నాలుక.