తల్లి భారతి వందనమమ్మా
నీఇల్లే మా నందనమమ్మా
మేమంతా నీ పిల్లలమూ,
నీ చల్లని ఒడిలో మల్లెలమూ
॥తల్లి భారతి ॥

తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళలా కొలిచెదమూ
చదువులు బాగా చదివెదమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా
॥తల్లి భారతి ॥

కులమత భేదం మరిచెదమూ
కలతలు మాని మెలిగెదమూ
మానవులంతా సమానులంటూ
మమతను సమతను పంచెదమూ
॥తల్లి భారతి ॥

తెలుగు జాతికే అభ్యుదయం
నవ భారతికే నవోదయం
భావి పౌరులం మనం మనం
భారత జనులకు జయంజయం
॥తల్లి భారతి ॥

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song