ఒదినకు ఒకసారి
బిందెకు బిగుసరి
బంగారు జడ కుచ్చుల మా ఒదిన
అహ బంగారు జడ కుచ్చుల మా ఒదిన
।ఒదినకు ।

తాటి తోపులో
పామును చూసి (2) వడ్డాణమంటుంది మా ఒదిన
తన నడుముకు కట్టమంది మా ఒదిన
।ఒదినకు ।

చెరువులొ ఉండే
కప్పల్ని చూసి
బోండాలంటుంది మా ఒదిన
తాను భోంచేస్తానంటుంది మా ఒదిన
।ఒదినకు ।

బండిని తోలే
బండోణ్ని చూసి
నా మొగుడంటుంది మా ఒదిన
ఎగిరి బండెక్కి కూర్చుంది మా ఒదిన
।ఒదినకు ।

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song