బాలలమూ మేము భవితవ్యులమూ మేము
చందమామల రూపం మాది
వెన్న లాంటి మనసులు మావి
"బాలలము"
స్వార్థమన్నదే ఎరుగని మేము
రేపటి సమాజ రూపకర్తలం
"బాలలము"
భారతమాత ఒడిలో వెలసిన కుసుమాలము మేము
భావి భారత పౌరులం భావి భారత పౌరులం
"బాలలము"
దశదిశల చీకట్లను తొలగించి
కాంతిని పంచే దివ్వెలమూ మేము
"బాలలము"
అజ్ఞానాన్ని తొలగిస్తాము
విజ్ఞానాన్ని నింపుతాం
"బాలలము"
ఆటంకాలను అధిగమిస్తాం
విజయాలను సాధిస్తాం
"బాలలము"