నవ్వ నవ్వు!

రాయలసీమకు కొత్తగా వచ్చాడు ఓ డాక్టరుగారు.
డాక్టరు: ఏంటయ్యా, నీ సమస్య?
పేషంటు: బాగా నవ్వొస్తున్నది సార్!(రాయలసీమలో నవ్వ అంటే దురద)
డాక్టరు: నవ్వొస్తే నవ్వరాదటయ్యా? ఆ మాత్రానికి నా దగ్గరకెందుకు రావటం?
పేషంటు: ఆ..

మంచి కథలు అవే!

ఎడిటర్: ఏంటయ్యా, మంజూ! వచ్చిన కథల్లోంచి మంచివి ఏరి ఈ ఫైలులో పెట్టమంటే ఇంత నిర్లక్ష్యమా- ఒక్క కాయితం కూడా ఫైల్ కాలేదు ఇంకా?
మంజు: నాపని నేను చేశాను సర్, వచ్చిన మంచి కథలు సున్న అయితే నన్నేం చేయమంటారు?

నీ....రసం

డాక్టరు: అదేంటయ్యా రామూ, నువ్వు మొన్నటికంటే ఇంకా నీరసంగా కనబడుతున్నావు. మొన్న నేను రాసిచ్చిన టానిక్ తాగలేదా ఏంటి?
పేషంట్: లేదు డాక్టర్..
డాక్టర్: ఏం! ఎందుకని?
పేషంట్: నేనూ... ఆ.. టానిక్ సీసా మూతా.... తీ...యలేకపోయానండీ...

సరికొత్త కార్!

రాము: ఒరేయ్ రాజూ! నేను ఓ సరికొత్త కారును కొనుక్కొచ్చాను రా..
రాజు: ఏంట్రా ఆ కారు ప్రత్యేకత?
రాము: అది పెట్రోల్ లేకుండానే నడుస్తుంది తెలుసా!
రాజు: ఏదీ, ఎక్కడరా ఆ కారు?
రాము: అదిగో రా ! మా అబ్బాయి ఆడుకుంటున్నాడు చూడు!!!

కలసి అడుక్కుందాం

అడుక్కునేవాడు: బాబూ! ఒక రూపాయుంటే దానం చేయండయ్యా!
అవతలివాడు: పోవయ్యా, లేదుపో..
అడుక్కునేవాడు: పోనీ బాబూ, ఓ అర్ధరూపాయైనా ఇవ్వండయ్యా?
అవతలివాడు: ఫో..లేదు..లేదు..
అడుక్కునేవాడు: బాబూ, ఒక్క పావులా అన్నా..
అవతలివాడు: పోవయ్యా, నాదగ్గరేమీలేదు...
అడుక్కునేవాడు: ఓ బీడీముక్కయినా ఉంటే ఇప్పించండి అయ్యా?
అవతలివాడు: ఫోవయ్యా, నాదగ్గరేమీలేదంటే వినవే..
అడుక్కునేవాడు: ఏమీలేదా..అయితే రండి. ఇద్దరం కలిసి అడుక్కుతిందాం..

నిజం మాత్రే

డాక్టరుగారి అబ్బాయి రాము: ఒరేయ్ రాజూ, మా నాన్న అమెరికా నుండి నిజాలు చెప్పించే మాత్రలు తెప్పించారురా.
రాజు: ఏదీ రా, నాకొకటివ్వు?
రాము: ఇదిగో తిను..
రాజు: ఒరేయ్, ఇది హాజ్మోలారా..
రాము: చూశావా, నువ్వు అప్పుడే నిజం చెప్పేశావు.

తల షేవింగ్

మంగలిషాపుకెళ్లిన రాము: ఏమయ్యా, కటింగుకు ఎంత తీసుకుంటావ్?
మంగలి: ఇరవై.
రాము: మరి షేవింగుకు?
మంగలి: పది.
రాము: అయితే నా తలకు షేవింగ్ చెయ్యి.

మాడ్

ఒక ఊళ్లో సం బడీ, నోబడీ, మాడ్ అనే ముగ్గరు వ్యక్తులు ఉండేవారు. ఒకసారి ఏదో గొడవయ్యి సం బడీ, నోబడీని చంపేశాడు. అది చూసిన మాడ్, వెంటనే పోలీస్ స్టేష న్ కు ఫోన్ చేశాడు "సార్! సం బడీ, నోబడీని చంపేశాడు" అని. అప్పుడు పోలీసాయన "ఆర్ యు మాడ్" అన్నాడు. అందుకు మాడ్, `యస్ సార్' అన్నాడు. పోలీసు వెంటనే ఫోన్ పెట్టేశాడు.

ఇంగ్లీషు మాత్ర

రాము: ఒరేయ్ రాజూ, నీకు ఇంగ్లీషుభలే వచ్చు. ఎలా నేర్చుకున్నావురా, అంత?
రాజు: నాదేమీ లేదురా. అంతా మా అమ్మ చలవే!
రాము: మీ అమ్మ నేర్పిందా!?
రాజు: కాదురా! నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ బాగా ఇంగ్లీషు మాత్రలు వాడిందట. వాటి ప్రభావమేనేమో, ఇదంతా..