వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా
పనిలోని పిల్లగాడు బడికొచ్చెనమ్మా
ఆటొచ్చెనమ్మా పాటొచ్చెనమ్మా
ఆట పాటల్తోటి చదువొచ్చెనమ్మా
తెలివొచ్చెనమ్మా తేటొచ్చెనమ్మా
నలుగురిలోతానే ముందొచ్చెనమ్మా
ఉరుమొచ్చెనమ్మా మెరుపొచ్చెనమ్మా
ఉదయించే సూర్యునిలా ఎదిగొచ్చెనమ్మా
వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా
పనిలోని పిల్లగాడు బడికొచ్చెనమ్మా.

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song