హిందూ ముస్లిం క్రైస్తవులు 
ఎవరైతేనేం మానవులే
జీవన సమరపు గమనంలో 
అలుపు ఎరుగని యాత్రికులే   "హిందూ"

మసీదు, చర్చి మందిరము 
హృదయంకన్నా గొప్పవా
కలవో శిలవో కలవో లేవో 
ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా     "హిందూ"

వర్షించు మేఘమాల 
స్పర్శించే చిరుగాలి
ఎండ వెన్నెల పారేనీరు 
కులమని మతమని వివక్ష చూపవు    "హిందూ"

కళ్లముందే సత్యం ఉంది 
ప్రకృతిలో సమభావం ఉంది
తెలిసి తెలిసి మారణహోమం 
రగిలించుటలో స్వార్థం ఉంది    "హిందూ"

భారతావని కూల్చేటందుకు 
మనిషిని మనిషే చీల్చేటందుకు
స్వార్థ రక్కసి చేతుల్లోన 
మతమనేదే మారణయుద్ధం          "హిందూ"

మనుషులంతా ఒకటై ముందుకు 
సాగుదాం విద్వేషం ఎందుకు
మానవులే మన మతమని చాటి 
మతోన్మాదం భరతం పడదాం   "హిందూ"
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song