సుధీర్ (సిద్ధిపేట) చెప్పిన జోకు:

కొడుకు: అమ్మా.... అమ్మా.... పక్కింటి వాళ్లు లడ్డూలు ఎందుకు చేసుకుంటున్నారు?
అమ్మ: వాళ్ల నాన్న చనిపోయాడట... అందుకు ....
కొడుకు: మరి మన నాన్న ఎప్పుడు చనిపోతాడమ్మా!
అమ్మ: !!!!

***

కేదార్ (ప్రకృతి బడి) చెప్పిన జోకు:

క్లాసులో ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతుంటారు.
టీచర్: రమ్యా! ఎందుకు గొడవ పడుతున్నారు?
రమ్య: ఈ పాప నన్ను ’నల్లగున్నావు’ అంటున్నది.....
టీచర్: నలుపు నారాయణ మెచ్చులేమ్మా !
రమ్య: చేసుకోబోయేవాడు మెచ్చాలిగా!
టీచర్: !!!!

***

రామాంజినేయులు(ప్రకృతి బడి) చెప్పిన జోకు:

నాయకుడు: రామూ, ఎలక్షన్స్ లో ఓట్లు బాగా రావాలంటే ఏమిచేయాలి?
రాము: రేషన్ షాపులలో బియ్యం, కిరోసిన్ తో పాటు ’మద్యం’ కూడా ఇస్తే సరిపోతుంది.
నాయకుడు: !!!!

***

నారాయణ, కొత్తపల్లి చెప్పిన జోకు:

భార్య: ఏమండీ, మన పెళ్లి రోజు కదా, ఈ రోజున కోడి కోసుకుందామా?
భర్త: మనం చేసిన పాపానికి దాన్నెందుకు బలిచేయటం
భార్య: !!!!

***

అలివేలమ్మ, బాలల కేంద్రం చెప్పిన జోకు:

(డాక్టర్ గారు మందుచీటీ రాసిచ్చారు.. మందుల షాపులో మందులు కొనడానికి వెళ్ళి; మందులు తీసుకొని వచ్చి-)
రోగి: సార్ ! అన్నీ దొరకాయి, కానీ వెనకాల రాసిన మందు ఒక్కటీ దొరకలేదు...
డాక్టర్: అది మందు కాదులేవయ్యా, పెన్ను రాస్తోందో, లేదో అని గీకాను అంతే!
రోగి:...... ??

***

త్రివేణి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెంటర్ చెప్పిన జోకు:

(ఒక చీమ పరిగెత్తుతూ ఉంటుంది..)
మిగిలిన చీమలు: ఎందుకు పరుగెత్తుతున్నావు?
చీమ: నా మిత్రుడు ఏనుగుకు యాక్సిడెంట్ అయింది; రక్తం ఇవ్వడానికి వెళ్తున్నాను.

***

గోపాల్, చెన్నేకొత్తపల్లి చెప్పిన జోకు:

సోషల్ టీచర్: రామూ, లేవరా ?
రాము: ఏమి టీచర్?
టీచర్: రెండవ ప్రపంచ యుద్దం ఎప్పటి నుండి ఎప్పటి దాకా జరిగింది.
రాము: 206 పేజినుండీ 207 పేజీవరకు.
టీచర్: !!!!

***

జి.రాజేశ్వరి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శాలి బండ, హైదరాబాదు రాసిన జోకులు:

భార్య: ఏమండోయ్! మన చంటోడు వారం రోజులనుండి నడుస్తున్నాడు
భర్త: నీకసలు బుద్దుందా, వారం రోజులంటే అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింటాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి!

***

ఒరే బాబూ, నీ వయసెంతరా?
బడిలో అయితే ఆరు,బస్సులో అయితే మూడు.

***

ఏరా చంటీ, మాథ్స్ పేపర్ ఎలా వుంది?
పేపరు ధీర్ఘచతురస్రాకారంలో వుంది, మార్కులు మాత్రం వృత్తాకారంలో వస్తాయి నాన్నా.

***