ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్
ఆడేవేళల ఆటలుఆడి, సత్తువ పొందండోయ్ బాలలు
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్.

సత్తువ ఉంటేనే పిల్లలు ఏదైనా సాధిస్తారు
సత్తువ ఉంటేనే పిల్లలు ఏదైనా సాధిస్తారు
పాటలు పాడక ఆటలు ఆడక మట్టిమొద్దులా కాగలరు
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్

సత్తువలేని పిల్లలు అయితే లోకువ అవుతారందరికీ
అన్నివేళలా ఓటమి కలిగే అవమానాలే ఎప్పటికీ
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్

ఆటలు ఆడిన పిల్లలదేహం ఉక్కు ముక్కలా అవుతుంది
గజగజ ఏమిచేసినా విజయం సొంతం అవుతుంది
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్

కండబలంతో కొండలనైనా పిండిపిండిగా చేయచ్చు
కండల బలమే లేకుంటే మరి గుండెకు బలమే రాదండోయ్
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్
ఆటలు ఆడండోయ్ బాలలు ఆటలు ఆడండోయ్

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song