1. చెయ్యని కుండా, పొయ్యని నీరు, పెట్టని సున్నం, పెట్టని గిలక ఏమిటిది? జ. కొబ్బరికాయ
  2. చింపిరి చింపిరి బట్టలు ముత్యాలు వంటి బిడ్డలు ఏమిటది? జ.ముక్కజొన్న
  3. తోకలేని పిట్ట తొంబై ఆమడలు పోతుంది? ఉత్తరం కాదు, ఏమిటది? జ. e-మెయిల్! 4.ముగ్గురు రాజులకు ఒక్కటే టోపి? జ. తాటికాయ
  4. అందనంత దూరంలో నల్ల చీర. నిండా లెక్కలేనన్ని తెల్ల పూలు ఏమిటవి? జ. ఆకాశం, చుక్కలు
  5. ఎండలో కనిపించేది వెంటే వచ్చేది ఏమిటది? జ. నీడ
  6. అయ్యా అంటే కలవవు - అమ్మా అంటే కలుస్తాయి. ఏమిటవి? జ. పెదవులు
  7. నాకు కన్ను ఉంటుంది కాని చూడలేను- నేనెవరు? జ. సూది
  8. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో దున్నుతారు , నోటితో ఏరుతారు: ఏంటది? జ. పుస్తకం