చీమ-గడ్డిచిలక
అనగా అనగా ఒక చీమ ఉండేది.
ఎప్పుడూ పనే చేసుకుంటూ ఉండేది అది. ఎండాకాలం అంతా ఆహార సంపాదనలో గడిచిపోయేది. వానాకాలం అంతా అది ఆ ఆహారాన్ని భద్రం చేసుకునేది. ఇక చలికాలం మొత్తం ఆకలిగా తింటూ, నిద్ర మత్తులో ఉండేది. అట్లా అది ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో మునిగిపోయే ఉండేది. అస్సలు బయటి ప్రపంచాన్నే చూసేది కాదు.
ఒకసారి దానికి ఎవరో చెప్పారు- 'ఈ దేశపు రాజుగారు ప్రతి చలికాలంలోనూ ఒక పోటీ పెడతారు. ఆ పోటీలో గెలవటం అంటే మాటలు కాదు. గెలిస్తే మాత్ర్రం ఇంక మన పంట పండినట్లే: జీవితమంతా సాఫీగా జరిగిపోతుంది. అయితే పోటీలో గెలిచేందుకు చాలా తెలివితేటలు ఉండాలి. ఒక్క తెలివితేటలుంటే చాలదు- చాలా సాధన కూడా అవసరం'.
చీమ వాళ్ళింటికి దగ్గర్లోనే ఒక గడ్డిచిలక (మిడత) ఉండేది. దానికి పాటలంటే చాలా ఇష్టం. వీలు చిక్కిందంటే చాలు, పాడటం మొదలుపెట్టేది. వాన చినుకులన్నా, ప్రొద్దునే చెట్ల ఆకులమీద నిలిచే మంచు బిందువులన్నా దానికి అమితమైన ప్రేమ. కధలంటే- ఇంకేమి, చెవులు కోసుకుంటుంది. ఎన్నెన్ని కథలు చదివిందో లెక్కలేదు. వాళ్ల అమ్మమ్మ దానికి తనెప్పుడో విన్న చీమ-గడ్డిచిలక కథ చెప్పి- "ఒరే, నువ్వు ఏమైనా పాడుకోరా, కానీ చలికాలానికి తిండిని సేకరించి పెట్టుకోవటం మాత్రం మరువకు. మనందరం బద్ధకస్తులమని ఇప్పటికే చెడ్డపేరు వచ్చేసింది. నువ్వే ఆ పేరును తుడిచెయ్యాలి" అంటుండేది.
"నువ్వు చూస్తూండు అవ్వా, రాజుగారు పెట్టే పోటీలో నేను నెగ్గి ఎంత మంచిపేరు సంపాదించి పెడతానో. నాకు మాత్రం లేదా, బాధ్యత!" అంటుండేది గడ్డిచిలక. పోటీకోసమని వాళ్ల నాన్న ఏవేవో పుస్తకాలు తెచ్చిపెడితే, అది వాటినన్నిటినీ త్వరత్వరగా చదివేసి, మళ్ళీ పాటలు, ఆటలు, ఎగరటాలు అన్నీ కొనసాగించేది.
"అప్పుడే చదివేశావా? ఇవేమన్నా కథల పుస్తకాలనుకున్నావా?" అని ఆయన మందలించేవాడు. "నిజం నాన్నా, నాకు వచ్చేసినై, కథల్ని వేగంగా చదివీ చదివీ వేటినైనా వేగంగానే చదువుతున్నాను నేను" అనేది అది.
అంతలో చలికాలం రానే వచ్చింది. రాజుగారు పెట్టే పోటీకి వెళ్ళాయి చీమా, గడ్డిచిలకా రెండూనూ.
చీమ "నేను గెలవాలి-నేను గెలవాలి" అని జపం చేసుకుంటూ, గోళ్ళు కొరుక్కుంటూ, భయం భయంగా నిలబడింది.
గడ్డిచిలక నవ్వుకుంటూ, చిలకపాటలు పాడుకుంటూ కులాసాగా నిలబడింది.
హడావిడిపడి, గందరగోళంపడి పోటీ జరిగే సమయానికి చతికిలబడిపోయింది చీమ.
గడ్డి చిలక ఆడుతూ పాడుతూ పోయి, పోటీలో చక్కగా గెలుచుకొని వచ్చింది.
కాబట్టి, చదువుల్లో హడావిడి, గందరగోళం అవసరం లేదు. ఇష్టంగా, ధైర్యంగా, మెల్లగా, బాధ్యతగా రోజూ చదువుకుంటే చాలు.
ఆటలు ఉంటే చదువులు రావని అనుకోకూడదు. నిజానికి ఆడుతూ పాడుతూ ఉన్న చిలక పిల్లలే బాగా చదువుకునేది.
చదువుల్లోగాని, ఆటపాటల్లోనేగాని- చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోకూడదు. మనందరం కలిసి బ్రతుకుతున్నాం కద, అందుకని ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలి.
పాత కాలంలో చీమలే గొప్పవని అనుకునేవాళ్ళు. గడ్డిచిలకలే గొప్పవనేది ఇవాల్టి మాట.
ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుందాం.
మనందరికీ దారి చూపుతున్న గడ్డిచిలకలకు అభినందనలతో,
కొత్తపల్లి బృందం.
24 వ్యాఖ్యలు
-
Good Stories and good Site i want to buy this for my school student where can i find books of this stories is this only online or will it be available in book(hardcopy)
వ్రాసిన వారు: Joseph — February 8
-
Me story chala bagundhandi ,liked it lot see good stories more on www.gmailjobs.com
వ్రాసిన వారు: Rajani — February 8
-
Miru wrasina e చీమ-గడ్డిచిలక childrans chala intresting ga unnadi.. chala danyavadamulu....Maheshbabu Hudumula, Nagarkurnool....
వ్రాసిన వారు: maheshbabu — August 16, 2011
-
మెచ్చుకుంటూ రాసిన వారందరికీ ధన్యవాదాలు. కథనం బాగాలేదని వ్రాసిన ఊటుకూరు సుబ్రమణ్యంగారికి కూడాను. అయితే అదెందుకు బాలేదో వారు వివరించి ఉంటే తదుపరి సంపాదకీయాల్లో సవరించుకునేందుకు వీలయ్యేది కదా అనిపించింది. ఈ సంచికపై వివరణాత్మక సమీక్ష ఒకదాన్ని ఆగస్టు సంచికలో- http://kottapalli.in/2011/08/సమీక్ష వద్ద చదవండి. దానిమీద కూడా మీ అభిప్రాయాలను ప్రకటించండి. మరోసారి అందరికీ 'మప్పితాలు'!
వ్రాసిన వారు: నారాయణ — August 1, 2011
-
కథ చాలా బాగున్నది
వ్రాసిన వారు: ప్రణవ్ మరియు ప్రణీత — July 31, 2011
-
చాలా బాగుంది.మా పిల్లలకు చెప్పాను.ఆసక్తిగా విన్నారు.
వ్రాసిన వారు: సత్యబాబు అంబటి — July 30, 2011
-
చాలా బాగు0ది.
వ్రాసిన వారు: రమ్య — July 26, 2011
-
కథ చాలా బాగుంది. ధన్యవాదములు.
వ్రాసిన వారు: shreshta.K. — July 25, 2011
-
kadha bagundi. Mee prayathnam adbhutham.kottapalli patrika prathi okkaru chadavali.
వ్రాసిన వారు: pavan vizag — July 11, 2011
-
కథ వ్రాసినవిధము సరిగా లెధు
వ్రాసిన వారు: ఊటుకూరు సుబ్రమన్యమ్ — July 11, 2011
-
ఛాలా బాగా రాసారు సూపర్ I Like
వ్రాసిన వారు: ఛరన్ — July 8, 2011
-
ఛాల బాగున్ది, నాకు ఛాల నఛిన్ది ఇ లొవె యొఉ యార్. క్రుథగ్నథలు
వ్రాసిన వారు: రమెష్ — July 8, 2011
-
కథ చాలా బాగుంది. పిల్లలకు నేర్పటానికి, మేం నేర్చుకోవటానికి.ధన్యవదాలు మల్లెషమ్
వ్రాసిన వారు: మల్లెషమ్ — July 8, 2011
-
చాలా బాగా రాసారు
వ్రాసిన వారు: బాలు.యస్ — July 7, 2011
-
కథ ఈ కాలనికి తగ్గత్తుగ ఛాల బాగున్ది.
వ్రాసిన వారు: ఉజ్జ్వల — July 6, 2011
-
కథ అద్భుతంగా ఉంది
వ్రాసిన వారు: శ్యాంసుందర్ కంచర్ల — July 4, 2011
-
కధ ఛాలా బాగుందీ
వ్రాసిన వారు: పూర్ణమాధురి — July 4, 2011
-
ఇది ప్రత్యేకమైన కథ.
వ్రాసిన వారు: శ్రీనివాస్ — July 4, 2011
-
ఛకని కథ
వ్రాసిన వారు: అదర్ష్ — July 4, 2011
-
కథ చాలా బాగు0ది..
వ్రాసిన వారు: స్వాతి — July 3, 2011
-
ఛాలా బాగున్నది అనదగ వున్ద్దది
వ్రాసిన వారు: పద్మ దుద్దెద — July 3, 2011
-
కథ బగున్ధి
వ్రాసిన వారు: — July 3, 2011
-
కథ చాలా బాగుంది. పిల్లలకు నేర్పటానికి, మేం నేర్చుకోవటానికి.ధన్యవదాలు.
వ్రాసిన వారు: జ్యోతి — July 3, 2011
-
వ్రాసిన వారు: జ్యొఝ్యఓతి — July 3, 2011
