స్వాగతం
సెప్టెంబరు నెల వచ్చేసింది. హైదరాబాదులో వినాయక చవితి ఉత్సవాల్ని చూడాలి. ఉత్సవాలకు ఆర్నెల్ల ముందునుంచే వినాయక విగ్రహాలను అచ్చేసి, వాటికి రంగులేసే పిల్లల్ని చూడాలి.
3-4 అంతస్తుల ఎత్తుండే వినాయక విగ్రహాల్ని, క్రేన్లలోఎత్తి చెరువులోవేసే దృశ్యాన్ని వీక్షించాలి. నిమజ్జనం తరువాత నెల రోజులవరకూ హుస్సేన్ సాగర్ చెరువులో మునిగి, అక్కడి ఇనుప చువ్వల్ని సేకరించి అమ్ముకొనే పిల్లల్ని గురించి ఆలోచించాలి.
అన్ని విగ్రహాల్లోని మట్టితో ఆ చెరువు పూడిపోతుంటే అలా కాకూడదని కార్పొరేషన్ వాళ్ళు ప్రతీ ఏడాదీ చేపట్టే పూడికతీత కార్యక్రమాన్ని చూడాలి. ఆ విగ్రహాలకు వాడే రంగుల కారణంగా చెరువు నీళ్ళలో సీసం, పాదరసం మొదలైన ప్రమాదకర రసాయనాలు మోతాదుకు మించి కనబడుతున్నాయని కంగారు పడుతున్న మేధావుల పలుకుల్ని వినాలి.
ఒకవైపున వినాయక చవితి ఊరేగింపులూ, మరోవైపున పవిత్ర రంజాన్ఉపవాసాల నమాజులు - "ఇవి రెండూ ప్రశాంతంగా గడచిపోతే చాలుదేవుడా " అని ప్రార్థించేవారి సంఖ్య ఎక్కువౌతుండటం గమనించాలి. వీటిని రెండింటినీ స్వార్థానికి వాడుకొనేదెలాగో బాగా తెలుసుకొన్న రాజకీయజ్ఞుల పాచికల్ని అర్థం చేసుకోవాలి.
పండుగలు చాలామంచివి. భక్తి శ్రద్ధలకు అవి ఆలవాలాలు. సంస్కృతీ, సహజీవనాలకవి పట్టుగొమ్మలు. వ్యక్తిజీవనానికీ, సంస్కృతికీ పండుగలు కేంద్రబిందువులే, సందేహంలేదు. అయితే యాంత్రికీకరణ, పర్యావరణ కాలుష్యం, పెరిగిపోతున్న పట్టణ జనాభాల నేపథ్యంలోంచి చూసి, ’ఈ పండుగల్ని ఇలాగే ఎందుకు జరుపుకోవాల’ని అందరూ ఆలోచించగలిగితే బాగుండు. ఇవన్నీ వేరేగా జరిగితే బాగుండు. నియాన్ బల్బుల ధగధగలూ, పోటీ బాజాలూ, ధనస్వామ్యపు ఊరేగింపులూ కాక భక్తి శ్రద్ధల వ్యక్తీకరణకు మరింత పవిత్రమైన మార్గాలు దొరికితే బాగుండు. తళుకుబెళుకుల్లో పట్టణాలు తమనితాము మరిచిపోకుండా ఒక్క క్షణం ఆలోచిస్తే చాలేమో....నిక్కమైన మంచి నీలాలు లభించక పోవు. కొత్తపల్లెలు తిరిగి జనించకపోవు.
3 వ్యాఖ్యలు
-
ఇ.ఎస్.సి.కీ .....ఎక్కడ ఉన్నది? మీ పత్రిక ఛాలా బాగున్నది.డిజైను,ముఖ ఛిత్రము, ఎంతో పొందికగా కుదిరినవి? మేము బాల గేయాలను పంప వఛ్ఛునా? ఏ పధ్ధతిలో పంప వలెను? కృతజ్ఞతలతో!!!!!!
వ్రాసిన వారు: కోణమానిని — september 29, 2008
-
సెప్టెంబరు సంచిక చూడడం ఆలస్యమయింది. మీరు డౌన్లోడు చేసుకునేందుకు వీలుగా పిడిఎఫ్ అందుబాటులోకి మార్చినా, ప్రింటులో చాలా చిన్న అక్షరాలు కన్పిస్తున్నవి. పిల్లలకు చదవడం కష్టంగా ఉంది. కొంచెం పెద్ద అక్షరాలలో ఇస్తే పిల్లలు సంతోషపడతారు. ప్రయత్నం మాత్రం హర్షించదగినదే. నెట్ ఉపయోగించుకోలేని పిల్లలకు పిడిఎఫే శరణ్యం కదా.
వ్రాసిన వారు: కే.కే.వేంకట శర్మ — september 22, 2008
-
Eee Ganesh nimajjanam valla entho kalushyam peruku poyi raka rakala jabbulu vastunnayi.
The heavy metals are known to bepersistent in the aquatic environment,and gradually accumulate and magnifythrough the process known as bioaccu-mulation and biomagnification, whilethey move up in the food chain. Thus,lead and mercury may magnify in their concentrations at different trophic levels,including in fishes and birds inhabiting the lake, which finally reach the humansthrough food. Organic compounds ofmercury, for example methyl mercurywhen it enters the human body, con-centrates in the brain and destroys thebrain cells, damaging the central nervoussystem, and also causes corrosion andulceration of the digestive tract. Thus,people consuming contaminated fishcaught from the lake over a period oftime may get afflicted with mercury poisoning.
Keeping in view of the above, please find alternative solution for immersion of Ganesh idols.
వ్రాసిన వారు: T Venkatappaiah — september 1, 2008
